గోల్కొండ బోనాల ఆదాయం రూ.11లక్షల22వేలు

మెహిదీపట్నం, వెలుగు : బోనాల ఉత్సవాల సందర్భంగా భక్తులు కానుకల రూపంలో రూ.11లక్షల22వేలు సమర్పించినట్లు గోల్కొండ శ్రీజగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ అధికారులు తెలిపారు. తొమ్మిది పూజల్లో పాల్గొన్న భక్తులు ఈ మొత్తం సమర్పించారన్నారు.

మంగళవారం మూడోసారి ఆలయ హుండీలను లెక్కించామని, మొత్తం రూ.11 లక్షల22వేల546 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ ఏఈ శ్రీనివాసరాజు, ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్​తెలిపారు. అయితే భక్తులు సమర్పించిన బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాలను వెల్లడించలేదు.