మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

గోదావరిఖని, వెలుగు: మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వ్యక్తిని గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్ పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. ఏసీపీ రమేశ్ వివరాల ప్రకారం.. ఏప్రిల్‌‌‌‌లో గోదావరిఖని అడ్డగుంటపల్లి వద్ద గంజాయిని అమ్ముతుండగా బీరనేని అభిలాశ్ అలియాస్‌‌‌‌ చంటి, అన్వర్​, చిక్కుడు రాహుల్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో గోదావరిఖని తిలక్​నగర్​కు చెందిన తాండ్ర అవినాశ్‌‌‌‌ తప్పించుకుని హైదరాబాద్‌‌‌‌ పారిపోయాడు.

అక్కడ క్యాబ్​ డ్రైవర్​గా పనిచేస్తూ ఖాళీ టైంలో ఒడిశాకు వెళ్లి గంజాయిని తీసుకువచ్చి అమ్మేవాడు. కాగా బైక్​పై హైదరాబాద్​ నుంచి గోదావరిఖని మీదుగా మహారాష్ట్రకు గంజాయి తీసుకెళ్తుండగా పోలీసులు అవినాశ్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్‌‌‌‌ చేశారు. అతని వద్ద 5.50కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్​, సిబ్బంది పాల్గొన్నారు.