వేములవాడలో వైభవంగా హనుమాన్​ శోభాయాత్ర

వేములవాడ, వెలుగు : హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మంగళవారం  వేములవాడ పట్టణంలో హనుమాన్ సేవ సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభయాత్ర వైభవంగా సాగింది. శ్రీ భీమేశ్వర ఆలయం నుంచి శ్రీ నగరేశ్వరస్వామి ఆలయం వరకు శోభయాత్ర కొనసాగింది. యాత్రలో విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శోభాయాత్ర సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు మొట్టల మహేశ్‌‌కుమార్​, బోనాల శివతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేశ్‌‌, లీడర్లు స్వామి యాదవ్, చిలుక రమేశ్‌‌, కనికరపు రాకేశ్‌‌, లక్ష్మీరాజం, రాజు, మల్లేశం పాల్గొన్నారు.