నిజామాబాద్ నగరంలో అందంగా ముస్తాబైన చర్చిలు

నిజామాబాద్ వెలుగు : క్రిస్టమస్ వేడుకల కోసం నిజామాబాద్ నగరంలోని సీ ఎస్ ఐ, నిర్మల హృదయ, గ్లోరియస్ చర్చిలను  విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం  క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనల కోసం అన్ని చర్చిల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. 

నిర్మల హృదయ చర్చిలో శాంతా క్లాజ్​ డెకరేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.