సాంకేతికత అందిపుచ్చుకోవడంపై జెమ్​ నివేదిక

పాఠశాల స్థాయిలో సాంకేతికతను అందిపుచ్చుకోవడం సానుకూల అంశమే అయినా దానిని మితిమీరి వినియోగించడం ప్రమాదకరమని ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ, సాంస్కీతిక సంస్థ (యునెస్కో) తెలిపింది. ఈ సంస్థకు చెందిన ప్రపంచ విద్యా పర్యవేక్షణ విభాగం గ్లోబల్​ ఎడ్యుకేషన్​ మానిటరింగ్​(జెమ్) విద్యలో సాంకేతికత అనే అంశానికి సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మొబైల్​ డివైజ్​లతో ఎక్కువ సమయం గడపడం విద్యార్థి దృష్టి మరల్చుతుందని, వారి అభ్యర్థనపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని జెమ్​ తెలిపింది. 

    టెక్నాలజీపైనే తీవ్ర దృష్టి పెట్టడమనేది భారీ మూల్యం చెల్లించుకోవడమేనని, అభ్యసన ప్రక్రియకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని తరగతి గదుల్లో వినియోగించాలని యూఎన్​ఓ నివేదిక పేర్కొంది. ఈ క్రమంలోనే దాదాపు 14 దేశాలు పాఠశాలల్లో స్మార్ట్​ఫోన్ల వినియోగాన్ని నిషేధించాయని పేర్కొంది.