నిజామాబాద్‌‌లో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

  • పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలి ఆరోపణ
  • తనకు న్యాయం చేయాలని వేడుకోలు

వర్ని, వెలుగు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా కు దిగింది. నిజామాబాద్‌‌ కు చెందిన షేక్‌ ‌ఫౌజియా సనా రుద్రూర్‌‌ మండలం బొప్పాపూర్‌‌కు చెందిన ముజ్జు ప్రేమించుకున్నారు.  ఇటీవల షేక్‌ ‌ఫౌజియా సనా పెళ్లి ప్రస్తావన తేవడంతో ముజ్జు మొఖం చాటేశాడు.  పెళ్లి చేసుకోనని చెప్పడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ప్రియుడి ఇంటి వద్ద బైఠాయించింది. ప్రియురాలు తెలిపిన వివరాల ప్రకారం తనకు ఇదివరకే పెళ్లి అయిందని తన భర్త దుబాయి వెళ్లి అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని విడాకులు తీసుకుంది.

  తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ముందుగానే ముజ్జుకు చెప్పింది.  పిల్లలను కూడా చూసుకుంటానని వివాహం చేసుకుందామని చెప్పి గర్భవతిని చేశాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోనని  చెబుతున్నాడని వాపోయింది.  పోలీసులు తనకు న్యాయం చేయాలని వేడుకుంది.