జగిత్యాల బాలసదనం నుంచి బాలిక మిస్సింగ్..

జగిత్యాల జిల్లాలో బాలిక మిస్సింగ్ కలకలం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని బాల సదనం నుంచి బాలిక కనిపించకుండా పోయింది. శుక్రవారం సాయంత్రి ఏడు గంటల సమయంలోఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక బాలసదనం నుంచి మిస్సయింది.

జిల్లా కేంద్రంలోని భీష్మ నగర్ లోని బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 17 యేళ్ల బాలిక శుక్రవారం ( సెప్టెంబర్ 28,2024)  సాయంత్రం అదృశ్యమైంది. బాలిక మిస్సింగ్ ను గుర్తించిన బాల సదనం నిర్వాహకులు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read :- బాధితురాలిపై కొరియోగ్రాఫర్ జానీ భార్య ఫిర్యాదు

మిస్సయిన బాలిక జిల్లా కేంద్రంలోని కేజీబీవీ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత కొంత కాలంగా ఆస్తమా, స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు జిగిత్యాల పట్టణ ఎస్సై మన్మధరావు.