కామారెడ్డిలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో బాలిక మృతి చెందింది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మనశ్రీ అనే బాలిక నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో బాలిక చనిపోయింది. మూడు రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రంజిత్ అనే బాలుడు డెంగ్యూతో చనిపోయాడు.
విషజ్వరాలతో వరుసగా ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో భయాలు మొదలయ్యాయి. విషజ్వరాల బారినుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇటు డెంగ్యూ,మలేరియాతో జాగ్రత్తగా ఉండాలని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.