గోడలపై పోస్టర్లు వేయద్దు.. రాతలు రాయద్దు... నిషేధం విధించిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిలో వాల్​పోస్టర్లు, వాల్​రైటింగ్స్ ను నిషేధించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. అనుమతులు లేకుండా వాల్ పోస్టర్లు వేసినా, వాల్ రైటింగ్స్​రాసినా సీరియస్​యాక్షన్​ఉంటుందని హెచ్చరించారు. డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని ప్రింటింగ్ ప్రెస్, సినిమా థియేటర్ యజమానులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు.

గోడలపై సినిమా, ఇతర పోస్టర్లు అంటించకుండా, రాతలు రాయకుండా చర్యలు తీసుకోవాలని  స్పష్టం చేశారు. వినకపోతే ఫైన్లు వేయాలని, ఆ వివరాలను తనకు పంపించాలని ఉత్తర్వులు జారీ చేశారు.