ఏబీసీపై ట్రంప్ పరువు నష్టం కేసు.. సారీ చెప్పి..రూ.127కోట్లు చెల్లింపు.. అసలు కథేంటంటే..

ABC నెట్ వర్క్, ఆ సంస్థ యాంకర్పై అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం దావా కేసులో ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ట్రంప్కు క్షమాప ణలు చెపుతూ.. రూ.127 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చేందుకు ABC నెట్ వర్క్ అంగీకరించింది. శనివారం (డిసెంబర్14) ఈ కేసులో ఓ ఒప్పందానికి వచ్చాయి. కోర్టు, లాయర్ ఖర్చుల కింద మరో రూ.84 లక్షలు ట్రంప్కు అదనంగా ABC నెట్ వర్క్ చెల్లించనుంది.        

ఎందుకు ట్రంప్ కు  నష్టపరిహారం.. 

2024 మార్చి 10న ABC ఛానెల్లో  ఓ ప్రజాప్రతినిధితో ఇంటర్వ్యూలో తనపై తప్పుడు ఆరోపణలు చేశాడని ఆ ఛానెల్ యాంకర్ జార్జ్ స్టెఫానోఫౌలోస్ పై ఫ్లోరిడా ఫెడర ల్ కోర్టులో ట్రంప్  కేసు వేశారు.  రేప్ కేసులో నిందితుడని పదే పదే వ్యాఖ్యలు చేశాడని లాస్యూట్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన ఫ్లోరిడి ఫెడరల్ కోర్టు.. ట్రంప్ కు నష్టపరిహారం చెల్లించాలని ABC ఛానెల్ ను ఆదేశించింది.

ఎందుకీ వివాదం..

1990 మధ్యలో ట్రంప్ తనపై డిపార్ట్మెంట్ స్టోర్ తనపై అత్యాచారం చేశాడని జీన్ కరోల్ అనే మహిళ ఆరోపిస్తూ కోర్టుకెక్కింది. అయితే 2023లో ఈ కేసుల కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు ప్రకారం.. కరోల్పై ట్రంప్ అత్యాచారం చేయలేదని.. లైంగికంగా వేధించాడని మాత్రమే రుజువైంది. దీంతో కరోల్కు ట్రంప్ రూ.42కోట్ల నష్టపరిహారం చెల్లించారు. కరోల్ పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు మరో రూ.697కోట్లు చెల్లించారు. 

మార్చిలో ABC న్యూస్‌పై దాఖలైన వ్యాజ్యంలో స్టెఫానోపౌలోస్ ప్రకటనలు తప్పుడు, ఉద్దేశపూర్వక, హాని కలిగించేలా ఉన్నాయని అని ట్రంప్ తన లాస్యూట్ పేర్కొన్నాడు. ట్రంప్ ,స్టెఫానోపౌలస్ వచ్చే వారంలో డిపాజిషన్ కోసం కూర్చోవాలని ఫెడరల్ న్యాయమూర్తి తీ ఇచ్చారు. ఈతీర్పు వచ్చిన మరుసటి రోజే రెండు పార్టీలు ఈ ఒప్పందానికి వచ్చాయి. 

న్యూస్ మీడియాపై కేసులు వేయడం ట్రంప్ కు ఇది మొదటి సారి కాదు..గత అక్టోబర్  చివరలో  CBS పై కూడా ట్రంప్ దావా వేశారు. వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో నెట్‌వర్క్ “60 మినిట్స్” ఇంటర్వ్యూపై $10 బిలియన్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేశాడు.