జనరల్​ స్టడీస్​​: హక్కుల కమిషన్​

పారిస్​లో మొదటి అంతర్జాతీయ వర్క్​షాప్​ 1991, అక్టోబర్​లో మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి జరిగింది. ఇందులో భాగంగా పారిస్ సూత్రాలు రూపొందాయి. వీటిని 1993, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రభావం భారత్​లోని మానవ హక్కుల కమిషన్​పై ఉన్నది. 1993, అక్టోబర్ 12న మానవ హక్కుల పరిరక్షణ చట్టం - 1993 ద్వారా ఈ కమిషన్ ఏర్పాటైంది. ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధ సంస్థ. ఈ చట్టం 2006, 2016లో సవరించారు. 

చైర్మన్ : మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. 

పూర్తికాల సభ్యులు

ఐదుగురు పూర్తికాల సభ్యులు ఉంటారు. వీరిలో ఒకరు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి లేదా మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి. లేక మరొకరు ఏదైనా హైకోర్టు సిట్టింగ్ లేక మాజీ ప్రధాన న్యాయమూర్తి అయి ఉండాలి. మిగిలిన ముగ్గురు సభ్యులు మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం కలవారై ఉండాలి. సభ్యులలో ఒకరు తప్పనిసరిగా మహిళా ఉండాలి. 

ఎక్స్ అఫీషియో సభ్యులు

జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్​, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్పర్సన్లు, దివ్యాంగుల చీఫ్ కమిషనర్ ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. 

సభ్యుల నియామకం

రాష్ట్రపతి ఒక హైపవర్ కమిటీని నియమించి, వారి సలహాతో కమిషన్ సభ్యులను నియమిస్తారు. ఈ హైపవర్ కమిటీకి ప్రధాన మంత్రి అధ్యక్షుడిగా,  ఐదుగురు సభ్యులు ఉంటారు. హైపవర్ కమిటీ అధ్యక్షుడు లేదా చైర్మన్ ప్రధాన మంత్రి. లోక్​సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ లోక్​సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కేంద్ర హోంమంత్రి సభ్యులుగా ఉంటారు. 

కాలపరిమితి

రాష్ట్రపతికి రాజీనామా సమర్పించవచ్చు. లేదా రాష్ట్రపతి తొలగించవచ్చు. కమిషన్ చైర్మన్, సభ్యుల కాల పరిమితి మూడేండ్లు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. 

కమిషన్ విధులు

రాజ్యాంగంలోని మానవ హక్కులకు సంబంధించిన నిబంధనలు అమలు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, ఫిర్యాదుల ఆధారంగా కానీ లేదా సుమోటోగా గానీ స్వీకరించి అమలు చేయడం, కారాగారాలను సందర్శించి ఖైదీల హక్కుల పరిరక్షణకు సంబంధించిన సూచనలు చేయడం, మానవ హక్కుల అమలులో ఆటంకాలు ఉంటే సమీక్షించి పరిష్కార మార్గాలను సూచించడం కమిషన్ విధులు. మానవ హక్కుల కమిషన్ సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. కమిషన్ చైర్మన్, సభ్యులు పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేపట్టరాదు. 

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మానవ హక్కుల కమిషన్ 1993లో ఏర్పాటైంది. ఇందులో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. చైర్మన్​గా నియామకమయ్యే వ్యక్తి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లేదా జడ్జిగా పనిచేసి ఉండాలి. ఒక సభ్యుడు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి లేదా సిట్టింగ్  న్యాయమూర్తి లేదా ఏడేండ్ల అనుభవం గల జిల్లా జడ్జి అయి ఉండాలి. మరో సభ్యుడు మానవ హక్కులకు సంబంధించిన విశిష్ట పరిజ్ఞానం కలిగి ఉండాలి. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ సూచనను అనుసరించి గవర్నర్ నియమిస్తారు. 

రాష్ట్ర మానవ హక్కుల సంఘం సభ్యులను ఎంపిక చేయడానికి ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీలో అధ్యక్షుడు (ముఖ్యమంత్రి), సభ్యులుగా శాసనసభ స్పీకర్, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఉంటారు. చైర్మన్, సభ్యులు తమ రాజీనామాను గవర్నర్​కు సమర్పించాలి. కానీ, వీరిని రాష్ట్రపతి తొలగిస్తాడు. చైర్మన్, సభ్యుల కాలపరిమితి మూడు లేదా 70 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు, ఏది ముందు అయితే అది వర్తిస్తుంది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. తన విచారణ తర్వాత నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తుంది. కలెక్టర్ కార్యాలయం జిల్లాలో మానవహక్కుల కోర్టుగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 25 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో కలిపి) రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటయ్యాయి. 

జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు

చైర్మన్                                                                   పదవీకాలం
రంగనాథ్ మిశ్రా                                                   1993–96
ఎం.ఎన్.వెంకటాచలయ్య                                   1996–99 
జె.ఎస్.శర్మ                                                           1999–2003
ఎం.ఎస్.ఆనంద్                                                  2006–06
రాజేంద్రబాబు                                                      2007–09
కె.జి.బాలకృష్ణన్                                                  2010–15
హెచ్.ఎల్.దత్తు                                                   2016–2020
అరుణ్​కుమార్ మిశ్రా                                          2021, జూన్ 2 నుంచి  2024, జూన్​ 1
జి.రామసుబ్రమణియన్​                                     2024, డిసెంబర్ 24 నుంచి.....