తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

 

  • కరీంనగర్ జిల్లాలో ఘటన

మానకొండూర్, వెలుగు:  ప్రమాదవశాత్తూ తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన ముడగని కనుకయ్య(59)  రోజు మాదిరిగానే తాటి గురువారం తాటి చెట్లు ఎక్కడానికి వెళ్లి కాలు జారి కింద పడి తీవ్రగాయాల పాలై స్పాట్ లో చనిపోయాడు.  గొర్ల కాపరి కనకయ్య డెడ్​బాడీని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.  భార్య సరోజన ఫిర్యాదుతో  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్​చార్జి సీఐ లక్ష్మీనారాయణ 
తెలిపారు.