వేదాల తల్లి ఎవరు.. ఆ మాత ఎప్పుడు జన్మించింది..

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం.. నాలుగు వేదాల ప్రకారం.. అన్ని రకాల పూజలు.. పునస్కారాలు నిర్వహిస్తుంటారని పండితులు చెబుతున్నారు. ఏ యఙ్ఞం చేయాలన్నా... ఎలాంటి క్రతువు నిర్వహించాలన్నా...  వేదాలలో రాసిన విధంగా పండితులు చేస్తుంటారు.  సత్య యుగంలో దైవ స్వరూపులు కూడా ఈ వేదాలను అనుసరించే చేసిన కొన్ని కార్యక్రమాలను కలియుగంలో మానవులు ఆచరిస్తున్నారని పురణాల ద్వారా తెలుస్తోంది. అయితే అలాంటి వేదాలను ఎవరు రచించారు.. వేద మాత ఎవరు.. ఆమె ఎప్పుడు పుట్టింది.. మొదలగు విషయాలను తెలుసుకుందాం. . . 

ప్రతి సంవత్సరం హిందువులు జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి గాయత్రి దేవి జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ మత పరమైన దృక్కోణంలో గాయత్రీ జయంతికి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గాయత్రీ మాతను ఎవరైతే నియమ నిష్ఠలతో పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం అనేక ప్రయోజనాలును ఇస్తుంది.  ఈ ఏడాది గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో, ప్రతీ తేదీకి ఓ ప్రాముఖ్యత ఉంటుంది. జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున గాయత్రీ జయంతిని జరుపుకుంటారు. ఆ రోజును హిందూ మతంలో ప్రత్యేకంగా భావిస్తారు. వేదాలకు మూలమైన గాయత్రీ మాత ఈ రోజునే దర్శనమిస్తుందని ప్రతీతి. అందుకే ఈ రోజును గాయత్రీ జయంతిగా జరుపుకుంటారు.  గ్రంథాలలో గాయత్రి మాతను వేదాల తల్లి అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, వేదాల తల్లి గాయత్రి  దేవి....  హిందూ మతం 4 వేదాలు మాత గాయత్రి నుండి ఉద్భవించాయని, 4 వేదాల సారాంశం గాయత్రీ మంత్రంలో ఉందని కూడా చెప్పబడింది. తల్లి గాయత్రిని జ్ఞాన దేవత అని కూడా అంటారు. 

గాయత్రి జయంతి ఎప్పుడు

హిందూ క్యాలెండర్ ప్రకారం, గాయత్రీ జయంతిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం జ్యేష్ఠ మాస ఏకాదశి జూన్ 17న జరుపుకుంటారు. ఈ రోజు ఉదయం 4:43 గంటలకు ప్రారంభమై జూన్ 18న ఉదయం 6:24 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం జూన్ 17న గాయత్రీ జయంతిని నిర్వహిస్తారు.

పూజ శుభ సమయం

గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మాతను పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానునికి నీరు సమర్పించి గాయత్రీ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మాత్రమే పూజలు సంపూర్ణంగా అవుతాయని నమ్ముతారు. ఈ రోజు ఉదయం 5.23 గంటలకు సూర్యోదయం జరుగుతుంది. అదే సమయంలో బ్రహ్మ ముహూర్తం ఉదయం 4.03 నుండి 4.43 వరకు ఉంటుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, సంపద లభిస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు.

గాయత్రీ జయంతి ప్రాముఖ్యత

తల్లి గాయత్రీ జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షం ఏకాదశి తిథి నాడు దర్శనమిచ్చింది. అంతేకాదు గాయిత్రీ దేవి 4 వేదాలను సృష్టించింది. పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుని సృష్టి సమయంలో మాత గాయత్రి కనిపించింది. అప్పుడు బ్రహ్మదేవుడు మాత గాయత్రిని మంత్రాన్ని వివరించమని అడిగాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం గాయత్రి మాత ‘ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్’ అని 4 వేదాలను ఆవిష్కరించింది. అందుకే గాయత్రిని వేదాలకు తల్లి అని అంటారు. గాయత్రీ మంత్రంలో 4 వేదాల సారాంశం ఉందని కూడా చెబుతారు. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మనిషికి ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి.

జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు గాయత్రి జయంతిని  జూన్ 17 (సోమవారం)న రాబోతుంది. ఈ రోజున గాయత్రి మాతను పూజించండం, గాయత్రీ మంత్రాన్ని జపించండం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. మానసిక ఆందోళనలన్నీ తొలగిపోయి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. తల్లి గాయత్రి దేవి అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆయుష్షు, శక్తి, సంపద, కీర్తిని ప్రసాదించే దేవతగా గాయత్రి దేవిని కొలుస్తారు

 సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రి అమ్మవారు నాలుగు వేదాలకు మూలంగా పరిగణించబడుతుంది. గాయత్రీ అమ్మవారు..  సరస్వతి, లక్ష్మి, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు. వేదాలు గాయత్రీ దేవి నుంచి  ఉద్భవించాయి. కనుక ఆమెను వేదమాత అని కూడా అంటారు. సనాతన ధర్మంలో వేదాల ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఎల్లప్పుడైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నా, మీ కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించాలనుకున్నా నిజమైన హృదయంతో గాయత్రిని పూజించండి. అమ్మవారిని ధ్యానం చేయండి. ఇలా చేయడం వలన మీ పనులన్నీ పూర్తవుతాయి.

. గాయత్రి మంత్రం నాలుగు వేదాల సారాంశం. గాయత్రి జయంతి రో మూడుసార్లు గాయత్రి మంత్రాన్ని జపించడం అన్నివిధాలా శుభం కలగజేస్తుంది.మొదటి సారి సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత, రెండవసారి మధ్యాహ్నం, మూడవసారి సూర్యాస్తమయానికి ముందు, ఆ తర్వాత గాయత్రి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది.గాయత్రి జయంతి రోజున భక్తి, శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారిని పూజించాలి. చివరలో మంగళ హారతి పాటతో గాయత్రి పూజను ముగించాలి. 

గాయత్రి మాత హారతి 

జయతి జై గాయత్రీ మాతా జయతి జై గాయత్రీ మాతా.
సంతోషాన్ని కలిగించ సరైన మార్గంలో నడిపించండి. జయతి జై గాయత్రి...
ఆది శక్తి, అలఖ్ నిరంజన్ జగ్‌పాలక్ కర్తీ
దుఃఖం, దుఃఖం, భయం, కష్టాలు, కలశం, పేదలు, దినసరి కూలీ. ..జయతి జై గాయత్రి...
బ్రహ్మ రూపిణి, ప్రణత్ పాలిన్ జగత్ ధాత్రీ అంబే.
భవ భీతి, ప్రజా క్షేమం, సుఖదా జగదమ్బే । జయతి జై గాయత్రి...
భయహారిణి, భవతారిణి, ఆనందరాశి
అవికారి, అవినాశి, అవిచలిత్, ఆఖరి || జయతి జై గాయత్రి
కామధేను సచ్చిత్ ఆనంద్ జై గంగా గీత.
సవిత శాశ్వతత్వం, శక్తి నీవు సావిత్రీ సీతవి || జయతి  జై  గాయత్రి...
ఋగ్, యజు సామ, అథర్వ ప్రణయని, ప్రణవ మహిమ.
కుండలినీ సహస్త్ర సుషుమాన్ శోభ గుణ ఘనత|| జయతి  జై  గాయత్రి...
స్వాహా, స్వధా, శచీ బ్రాహ్మణీ రాధా రుద్రాణీ ।
జై శత్రూప, ప్రసంగం, విద్య, కమలా కళ్యాణి.|| జయతి  జై  గాయత్రి...
తల్లీ, మేము పేదలం, దుఃఖితులము
కుటిలత్వం, కపటత్వం నుంచి మమ్ముల కాపాడు.. || జయతి  జై  గాయత్రి
ప్రేమగల కరుణామయివైన తల్లి పాదాలకు ఆశ్రయం .. || జయతి  జై  గాయత్రి...
కామం, క్రోధం, గర్వం, దురాశ, అహంకారం, దుష్టత్వం, ద్వేషం.
స్వచ్ఛమైన బుద్ధి, పాపరహిత హృదయం మనస్సును శుద్ధి చేస్తాయి||జయతి  జై  గాయత్రి...
జయతి జై గాయత్రీ మాతా, జయతి జై గాయత్రీ మాతా....