చౌటుప్పల్ లో ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలు

చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఘనంగా కంఠమహేశ్వరస్వామి బోనాలను గౌడ కులస్తులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గౌడ కులస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని  సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి సురమాంబకంఠ మహేశ్వరస్వామి ఆలయం వరకు బోనాలను ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, మహిళా కళాకారులు డ్యాన్సులు, డోలు, డప్పుల విన్యాసాలతో వైభవంగా వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో మున్సిపాలిటీ  చైర్మన్ వెన్ రెడ్డి రాజు, కౌన్సిలర్లు, ఆలయ గౌరవ అధ్యక్షుడు బత్తుల లక్ష్మయ్యగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.