ఆర్మూర్ ఏసీపీగా గట్టు బస్వారెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ ఏసీపీగా గట్టు బస్వారెడ్డి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ పనిచేసిన ఎం.జగదీశ్ చందర్ బదిలీ కాగా, ఖమ్మం రూరల్ ఏసీపీగా ఉన్న బస్వారెడ్డిని ఆర్మూర్ కు ట్రాన్ఫ్​ఫర్​పై ఇక్కడికి వచ్చారు. సోమవారం ఆర్మూర్ ఏసీపీ ఆఫీస్ లో చార్జ్​తీసుకున్న బస్వారెడ్డిని సబ్ డివిజన్ పోలిసులు మర్యాదపూర్వకంగా కలిశారు. 

తాడ్వాయి: తాడ్వాయి ఎస్ఐగా వీ వెంకటేశ్వర్లు సోమవారం సాయంత్రం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్​ఐ ఆంజనేయులు బదిలీపై గాంధారికి వెళ్లారు.