అరెస్టులు ఆపి, పాలనపై దృష్టిపెట్టండి : గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు: రాష్ట్రంలో  ప్రజా సమస్యలపై మాట్లాడే, అడిగే  హక్కు కూడా  లేకుండా పోయిందని, ప్రతిపక్ష నేతల అరెస్టులు ఆపి, పాలనపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే  గంగుల కమలాకర్   డిమాండ్  చేశారు.  మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిరసిస్తూ గురువారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాస్తోరోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఏడాది పరిపాలనలో  ప్రశ్నిస్తే అరెస్టులు  చేయడం దారుణమని మండిపడ్డారు. సమస్యలపై మాట్లాడితే ఇన్ని నిర్భంధాలు, అరెస్టులా అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని జైళ్లలో పెట్టాలంటే లక్షమందిని అరెస్ట్​ చేయాల్సి ఉంటుందని, అప్పుడు రాష్ట్రంలోని జైళ్లు కూడా సరిపోవన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్,  కార్పొరేటర్లు,లీడర్లు పాల్గొన్నారు. 

తిమ్మాపూర్​, వెలుగు: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వనిత, లీడర్లు ఏకానందం, లక్ష్మణ్, రమేశ్, అనిల్, ఆంజనేయులు, కృష్ణ, సంపత్ 
పాల్గొన్నారు.