కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో దీక్షా దివస్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ చేయాలి : ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 

తిమ్మాపూర్, వెలుగు: ఈ నెల 29న కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనున్న దీక్షాదివస్‌‌‌‌ను సక్సెస్‌‌‌‌ చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. తిమ్మాపూర్ మండలం అల్గునూర్‌‌‌‌‌‌‌‌లో సభ ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో ఆనాడు కేసీఆర్ దీక్షకు దిగిన రోజు తెలంగాణ చరిత్రలో మరువలేనిదన్నారు.

నాటి ఆమరణ దీక్షను అడ్డుకునేందుకు నాటి పాలకులు కుట్ర చేశారన్నారు. దీక్షాదివస్‌‌‌‌కు చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా కేటీఆర్ హాజరుకానున్నట్లు చెప్పారు. ఆయన వెంట మేయర్ సునీల్‌‌‌‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ ఉన్నారు.