నాగాపూర్లో సినిమా షూటింగ్

బాల్కొండ, వెలుగు : మండలంలోని నాగాపూర్ లో గ్యాంగ్ ఆఫ్ గోపాల్ పేట్ సినిమా షూటింగ్ బుధవారం జరిగింది.  రీల్ యువతకు స్ఫూర్తిగా నిలిచే గ్రామీణ నేపథ్యంగల మూవీని రీల్  రియల్ మూవీ క్రియేషన్ రూపొందిస్తోందని దర్శక,నిర్మాతలు మధు మల్లంవైవి, శ్రీఫణీంద్ర, మనీష్ రెడ్డి తెలిపారు.  

ప్రముఖ తెలంగాణ గేయ రచయిత కోదారి శ్రీనివాస్ సంగీతం అందిస్తుండగా,  మధు మల్లం వైవి దర్శకత్వం వహిస్తున్నారు.  హీరో నరేష్, హీరోయిన్ లలిత పై సన్నివేశాలను చిత్రీకరించారు.