రెజ్లింగ్ లో గణేశ్​కు గోల్డ్​ మెడల్

హనుమకొండ సిటీ, వెలుగు:  సీఎం కప్ రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో హనుమకొండకు చెందిన గణేశ్ సత్తా చాటాడు.​ సబ్ జూనియర్ 60 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో రెజ్లింగ్ పోటీలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ అజీజ్ ఖాన్ బుధవారం ప్రారంభించారు. 60 కేజీల విభాగంలో గణేశ్ గోల్డ్​మెడల్ గెలుపొందగా, సిల్వర్ కె. యోగేశ్వర్ (నిర్మల్), రజతం బి. ప్రవీణ్ (కామారెడ్డి), ఎల్. మోహన్ గౌడ్ (రంగారెడ్డి) దక్కించుకున్నారు. డీఎస్ఓ గుగులోతు అశోక్ కుమార్, తెలంగాణ ఆమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్​కార్యదర్శి కరీం, రెజ్లింగ్ కోచ్ కందికొడ రాజు పోటీలను పర్యవేక్షించారు. అలాగే 51 కేజీలు,45 కేజీలు,40 కేజీల విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు పతకాలను అందజేశారు.