గణేష్ చతుర్థి 2024: వినాయక  చవితి రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి!

సెప్టెంబరు 07 శనివారం వినాయకచవితి..ఈ రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి, శుభముహూర్తం ఏంటి?.. గణపతి నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుపుకుంటారు.. చవితి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలో తెలుసుకుందాం...

వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ!
నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!!

గణపయ్య కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు..ఘనమైన భగవంతుడు. చిన్నా పెద్దా అందరూ మెచ్చే దైవం. ఈ సష్టి మొత్తం ఎన్నో గణాలతో కూడి ఉంటుంది..ఆ గణాలను శాసించే మహా శక్తిమంతుడు లంబోదరుడు. అందుకే ఏది ప్రారంభించినా నిర్విఘ్నంగా సాగిపోవాలని కోరుకుంటూ ఎలాంటి గణాలు అడ్డుతగలకూడదని భావించి..గణపతిని పూజిస్తారు. ఈ ఏడాది (2024) వినాయక నవరాత్రులు ఎప్పటి నుంచి ఎప్పటివరకూ..చవితి రోజు పూజ చేసుకునేందుకు శుభ ఘడియలేంటి...

వినాయక చవితి పూజా ముహూర్తం 

దృక్ పంచాంగ్ ప్రకారం, చతుర్థి తిథిలో గణేశుడిని ఇంటికి స్వాగతించే శుభ సమయం సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 03:01 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 07 సాయంత్రం 05:37 గంటలకు ముగుస్తుంది. 

పవిత్రమైన పూజ ముహూర్త సమయం సెప్టెంబర్ 7, 2024న ఉదయం 11:03 నుండి మధ్యాహ్నం 01:34 వరకు 

ALSO READ | వినాయకచవితి పండుగ వెనుకున్న పరమార్థం ఇదే..

మండపాల్లో గణపయ్య కొలువుతీరేందుకు చాలా సమయం పడుతుంది. సెప్టెంబరు 07 శనివారం మధ్యాహ్నం వరకే చవితి ఘడియలున్నాయి..అంటే మండపాలకు విగ్రహాలు చేరి పూజ ప్రారంభించే సమయానికి చవితి పోయి పంచమి మొదలవుతుంది. అందుకే సాయంత్రం సయానికి వినాయక పూజ చేసేమండపాల్లో ముందురోజైన సెప్టెంబరు 06 శుక్రవారం సాయంత్రం చవితి ఉన్న సమయంలో తొలి పూజ చేసేస్తారు...ఇక మర్నాడు పూజ ఆలస్యం అయినా పర్వాలేదన్నది కొందరి అభిప్రాయం.

నవరాత్రులు ప్రారంభం - ముగింపు 

సెప్టెంబరు 07న ప్రారంభమయ్యే వినాయక నవరాత్రులు...సెప్టెంబరు 16 తో ముగుస్తాయి. సెప్టెంబరు 6 సాయంత్రమే మండపాల్లో విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసేవారు సెప్టెంబరు 15 నే నిమజ్జనం చేసేస్తారు. ఇంకా మూడు రోజులు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మి రోజులు, పదకొండు, ఇరవై ఒక రోజులు ఇలా ఎన్ని రోజులు మండపాల్లో విగ్రహాలు ఉంచాలన్నది ప్రాణప్రతిష్ట చేసిన వారి ఇష్టం...

గణేశ ద్వాదశనామ స్తోత్రమ్

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ |
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయేః || 1 ||

అభీప్సితార్థ సిధ్యర్థం పూజితో యః సురాసురైః |
సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః || 2 ||

గణానామధిపశ్చండో గజవక్త్రస్త్రిలోచనః |
ప్రసన్నో భవ మే నిత్యం వరదాతర్వినాయక || 3 ||

సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః || 4 ||

ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్ || 5 ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ ధర్మార్థీ మోక్షమక్షయమ్ || 6 ||

విధ్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య న జాయతే || 7 ||

|| ఇతి ముద్గలపురాణోక్తం శ్రీగణేశద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్