వినాయక నవరాత్రి ఉత్సవాలకు రకరకాల ఆకృతులతో వినాయకుడిని తయారు చేయించడం కాని.... తయారు చేయడం కాని చేస్తారు.. అందమైన సెట్టింగులతో వినాయకుని మండపాన్ని అలంకరణ చేస్తారు. వినూత్న రీతిలో వినాయక ప్రతిమను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా సరికొత్తగా తమలపాకుల వినాయకుని ప్రతిమను తయారు చేయించి పూజలు చేశారు. లక్షా 25 వేల తమలపాకులతో తయారు చేసిన వినాయకుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
food.khanaa.ujjain అనే ఇన్ స్ట్రాగ్రామ్ లో ప్రత్యేక ఆకర్షణతో తమలపాకుల వినాయకుడు కొలువు దీరాడు. తమలపాకు వినాయకుడు, ఏనుగులు కూడా అమర్చారు. భక్తులను ఆకట్టుకునేలా తమలపాకు వినాయకుని ప్రతిమను ఎంతో అందంగా తయారు చేశారు . ఏ శుభ కార్యక్రమానికైనా తమలపాకులు హిందువులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. . పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా భావించారు.
పర్యావరణంకు భంగం కలగకుండా.. ప్రకృతిని గౌరవిస్తూ ఒక టన్ను పుట్టమట్టి, ఒక టన్ను కాగితపు గుజ్జుతో ఎంతో చూడముచ్చటగా తమలపాకుల వినాయకున్ని తయారు చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కొంతమంది గణపతి బప్పా మోరియా అని రాయగా ... మరికొందరు జై శ్రీ గణేశా అని పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఉత్సాహంతో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటారు. పది రోజులు ఎంతో భక్తి శ్రద్దలతో ఉత్సవాలు జరిపి తరువాత నిమజ్జనం చేస్తారు.
సనాతన భారతీయ చరిత్రలో తమలపాకులకు ఒక విశిష్టత ఉంది. ప్రతి ఇంటా జరిగే శుభ, అశుభ కార్యాలతో పాటు పండుగల వేళ దేవతా మూర్తులకు నిర్వహించే పూజాదికాలు, యజ్ఞ, యాగాలలో తమలపాకులకు ప్రథమస్థానం కల్పిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తమలపాకు లేకుండా ఎటువంటి పూజలు నిర్వహించరు. అంతేకాదు తమలపాకు దివ్యఔషద గుణాలు కలిగియుంటుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. దేవతలు సైతం .. స్వీకరించే తమలపాకులతో తయారైన వినాయకున్ని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. ఎంతో విశిష్టత కలిగిన తమలపాకు వినాయకుని దర్శనార్థం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.