Ganesh Chaturthi 2024 : మీ బంధుమిత్రులకు వినాయకచవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి


 పండుగ అంటే అందరూ కలిసి చేసి చేసుకునేది. మనకు దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పండుగ శుభాకాంక్షలు చెప్పాలని చూస్తాము. అయితే ఈ వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలాంటి సందేశాలతో విష్ చేయండి.

మీరు, మీ ప్రియమైనవారు గణేష్ చతుర్థి లేదా వినాయక చవితిని దూరంగా ఉంటూ జరుపుకుంటున్నట్లయితే.. వారికి Facebook, WhatsApp, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండి. వీటిలో మీకు నచ్చినవి.. మీ బంధుమిత్రులకు పంపేయండి.

గణేష్ చతుర్థి 2024 శుభాకాంక్షలు, సందేశాలు...

 శుక్లాంబరధరం విష్ణుం 
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
త్సర్వ విఘ్నోప శాంతయే
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

 బొజ్జ గణపయ్య మీ కోరిన కోరికలన్నింటినీ
నెరవేర్చి, మీకు సకల విజయాలను అందించాలని కోరుకుంటున్నా.
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

 అగజానన పద్మార్కం.... గజాననమ్ అహర్నిశం
అనేకదంతం భక్తానాం... ఏకదంతమ్ ఉపాస్మమే
వినాయక చవితి శుభాకాంక్షలు

ఓం వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ...సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి శుభాకాంక్షలు

కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో..
 మన రోజును ప్రారంభిద్దాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 గణేశుడు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తూ ..
ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. 
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ 
విజయవంతం చేయాలని, మీ ఇంట్లో సుఖసంతోషాలు 
వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
హ్యాపీ వినాయక చతుర్ధి. 

మీకు ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కలగాలని గణేశుడిని ప్రార్థిస్తున్నాను.
 గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

ఆదిపూజ్యుడికి అభివందనం..
పార్వతీనందనుడికి ప్రియవందనం..
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి..
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:....మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

 ఈ వినాయక చవితి మన దుఃఖాలన్నింటినీ పోగొట్టి..
 మన సంతోషాన్ని పెంచి.. మనందరికీ ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించాలని..
 నేను గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 గణపతి బప్పా మోరియా. .
వినాయకుడు మీకు జ్ఞానం, తెలివి, శ్రేయస్సు..
 ఆనందం, విజయాన్ని అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 
మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 ఆ విఘ్నేశ్వరుడు మీ కష్టాలను తొలగించి,
మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం...
అందివ్వాలని కోరుకుంటూ 
హ్యాపీ వినాయక చవితి

ఓం గన్ గణపతయే నమో నమః! శ్రీ సిద్ధివినాయక నమో నమః! 
అస్త వినాయక్ నమో నమః! గణపతి బప్పా మోరియా! గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

 మీరు చేసే ప్రతికార్యం ... ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం కావాలని కోరుకుంటూ..
వినాయక చవితి శుభాకాంక్షలు

మన హృదయాలలో వినాయకుడు ఉంటే..
 జీవితంలో దేని గురించి చింతించాల్సిన పని లేదు. 
మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

వినాయకుని నైవేద్యాలు ఎంత తియ్యగా ఉంటాయో...
మీ జీవితం కూడా అంతే తియ్యగా మారాలని కోరుకుంటూ 
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు

 మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

 మీకు మీ కుటుంబసభ్యులకు అందమైన, ఉల్లాసమైన వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

 ఈ పండుగ సందర్భం మీకు మరెన్నో చిరునవ్వులు...
వేడుకలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.
మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

 విఘ్నహర్తుడైన గణేశుడు మన జీవితాల నుంచి అన్ని అడ్డంకులను...
దుఃఖాలను తొలగించాలని కోరుకుంటూ.. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

గణేశుడి అనుగ్రహం మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది.
 గణేశుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండుగాక. ..వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

 ఆ లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా
మీ కష్టాలను విజయాలుగా మార్చాలని,
కారుమబ్బులు కమ్మిన జీవితాల్లో 
ఇంద్రధనుసులు విరిసేలా చేయాలని కోరుకుంటూ..
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

 సకల విఘ్నాలు తొలగించే ఆ గణేశుడి ఆశీస్సులు
మీ కుటుంబంపై ఉండాలని కోరుకుంటూ...
మీ కుటుంబసభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

 ఏకదంతం మహాకాయం....తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం..వందేహం గణనాయకమ్
హ్యాపీ వినాయక చతుర్థి

 ఆ విఘ్నాధిపతి మీకే క్షేమ, స్థైర్య..ఆయురారోగ్యాలు సిద్ధించాలని
సుఖసంతోషాలు చేకూర్చాలని..మనస్పూర్తిగా కోరుకుంటున్నా
వినాయక చతుర్ధి శుభాకాంక్షలు

 మీరు చేసే ప్రతికార్యం ..ఆ వినాయకుడి ఆశీస్సులతో 
విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున
మీరంతరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ...
వినాయక చవితి శుభాకాంక్షలు

 పర్యావరణాన్ని పరిరక్షిస్తూ..అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...
మట్టి గణపయ్యను పూజిద్ధాం...మీకు, మీ కుటుంబసభ్యులకు ...
వినాయక వితి శుభాకాంక్షలు