రామారెడ్డి మండలంలో ఐదుగుళ్ల నిర్మాణం కోసం భూమి పూజ : గండ్ర నర్సింహులు

సదాశివనగర్​, వెలుగు: రామారెడ్డి మండలంలోని పోసానిపేట్​ ఆదివారం గ్రామ శివారులో  ఐదు గుళ్ల నిర్మాణం కోసం భూమి పూజలు నిర్వహించినట్లు  ఆలయ కమిటీ అధ్యక్షుడు  గండ్ర నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఐదు గుళ్ల నిర్మాణం కోసం దాతుల ముందుకు రావడంతో నిర్మాణ పనులను భూమి పూజ చేసినట్టు  తెలిపారు. ఈ కార్యక్రమంలో  రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్​​ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్​ గీరెడ్డి మహేందర్​ రెడ్డి, గీరెడ్డి శంకర్​ రెడ్డి(అడ్వకెట్​), శివ్వారెడ్డి, ఆలయ నిర్మాణ ఉపాధ్యక్షుడు గాండ్ల సాయిలు, కార్యదర్శి శివరాజం పాల్గొన్నారు.