పబ్లిక్​ అకౌంట్స్ కమిటీ చైర్మన్​గా అరికెపూడి 

హైదరాబాద్, వెలుగు : తెలంగాణ శాసనసభ ఆర్థిక కమిటీలు ఏర్పాటయ్యాయి. అందులో ప్రజాపద్దుల సంఘం (పబ్లిక్‌‌ అకౌంట్స్‌‌ కమిటీ), అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల సమితికి చైర్​పర్సన్లు, సభ్యులను నియమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచారి బులిటెన్ జారీ చేశారు. ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌‌గా శేరిలింగం‌‌పల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియామకం కాగా సభ్యులుగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌‌, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్‌‌ రెడ్డి, రామారావు పవార్‌‌, అహ్మద్‌‌ బిన్‌‌ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, భాను ప్రసాద్‌‌ రావు

ఎల్‌‌.రమణ, సత్యవతి రాథోడ్‌‌, ఎమ్మెల్యే జీవన్‌‌ రెడ్డి నియమితులయ్యారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి అంచనాల (ఎస్టిమేట్స్) కమిటీ చైర్‌‌ పర్సన్‌‌గా ఎంపిక కాగా, సభ్యులుగా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌‌ రెడ్డి, మాగంటి గోపి, విజయరమణారావు, రాందాస్‌‌ మాలోత్‌‌, మామిడాల యశస్విని రెడ్డి, రాకేశ్​ రెడ్డి, ఎంఎస్‌‌ ప్రభాకర్‌‌ రావు, సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్‌‌ రావు, యాదవ్‌‌ రెడ్డి ఉన్నారు.

ఈర్లపల్లి శంకర్ ప్రభుత్వ రంగ సంస్థల సమితి చైర్మన్‌‌గా అపాయింట్​ అవ్వగా సభ్యులుగా సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, వేముల వీరేశం, కుంభం అనిల్‌‌కుమార్‌‌ రెడ్డి, మక్కన్‌‌ సింగ్‌‌ రాజ్‌‌ ఠాకూర్‌‌, సంజీవ్‌‌ రెడ్డి, లక్ష్మీకాంతారావు, కౌసిర్‌‌ మెహిద్దీన్‌‌, పోచంపల్లి శ్రీనివాస్‌‌ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, తాతా మధుసూదన్‌‌, మీర్జా రియాజుల్‌‌ హసన్ ఉన్నారు.