యాదగిరిగుట్ట శివాలయంలో గణపతి ఉత్సవాలు

యాదాద్రిభువనగిరి:యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహా స్వామి ఆలయ అనుబంధ శివాలయంలో గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణేష్ నవరాత్రి ఉత్సవాల ను పురస్కరించుకొని శివాలయంలో పుణ్య హవాచనం, రక్షాబంధనం, కలశస్థాపన, గణపతి పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో భాస్కర్ రావు , అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి ఈ పూజలు నిర్వహించారు.