పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ  48 వేల 18 ఓట్ల ఆధిక్యం 

పెద్దపల్లి సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లీడ్ లో  ఉన్నారు. మొదటి రౌండ్ ను తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. 8 వ రౌండ్ ముగిసే సమయానికి 48వేల 18 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ కొనసాగుతోంది. 8మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహబూబాబాద్, జహీరా బాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్,  నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో  కాంగ్రెస్ లీడ్ లో ఉంది.

దీంతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానా నికి జరిగిన ఉపఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ నారాయణ ముందంజలో ఉన్నారు.  ఈ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఏ ఒక్క సెగ్మెంట్ లో కూడా ప్రభావం చూపించలేకపోయింది. 

మరోవైపు బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం ఒక స్థానంలో  ఆధిక్యంలో ఉన్నాయి.  మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, కరీంనగర్,నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.