- బీఆర్ఎస్ సర్కారు రైల్వే ఫండ్స్ ను వేరే పనులకు వాడుకుంది
- ఎంపీ అర్వింద్ ఆరోపణలు
నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని అడివి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వగా గత బీఆర్ఎస్ సర్కారు వాటిని దారి మళ్లించిందని ఎంపీ అర్వింద్ఆరోపించారు. పనుల్లో పురోగతి లేకపోవడానికి కారణం అదేనన్నారు.
శుక్రవారం ఆయన జిల్లాలో నడుస్తున్న ఆర్వోబీ పనులు పరిశీలించారు. ఊరు మామిడిపల్లి బ్రిడ్జి ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఆఫీసర్లకు వార్నింగ్ ఇచ్చారు. తాను వచ్చిన టైంలో కాంట్రాక్టర్ లేకపోవడం ఏమిటని మండిపడ్డారు. నగర శివారలోని మాధవ్నగర్ ఆర్వోడీ పనులు లేట్ కావడానికి స్టేట్ గవర్నమెంట్కారణమని ఆరోపించారు. రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వద్ద ఆర్వోబీ 77 పనులను శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆఫీసర్లకు సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంచెట్టి గంగాధర్, పుప్పాలశివరాజ్, ఆకుల శ్రీనివాస్, పోల్కం వేణు తదితరులు ఉన్నారు.