వరుణ దేవుడా కరుణించవయ్యా... కరీంనగర్​ జిల్లాలో కప్పల పెళ్లి

 కప్పలకు పెళ్లిళ్లు చేస్తే వర్షాలు కురుస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరిపించరు. శుభలేఖలు పంచిపెట్టి, చాలామంది అతిథులను పిలిచి, కప్పలను వధూవరులుగా రెడీ చేసి వైభవంగా పెళ్లి చేస్తారు. వరుణుడి కరుణకోసం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల  ప్రజలు వేడుకుంటున్నారు.వర్షాలు కురవాలని  కప్పలకు పెళ్లిళ్లు చేశారు. 

ALSO READ | Rain Alert: 23 రాష్ట్రాల్లో 5 రోజుల పాటు వర్షాలు..  800 గ్రామాలకు వరద ముప్పు

ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవాలంటే కప్పలకు పెళ్లి చేయడం, విందు భోజనం ఏర్పాటు చేయడం లాంటివి గ్రామాల్లో చేస్తుంటారు. కప్పలకు పెళ్లి చేస్తే దేవ దేవేంద్రుడి కరుణతో వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో కప్పలకు ఈ వింత పెళ్లి చేస్తుంటారు. వరుణుడి కటాక్షం కోసం కరీంనగర్​ జిల్లా  ఇల్లందకుంట మండల కేంద్రంలో  ఘనంగా కప్పల పెండ్లి జరిపించారు.. అచ్చం  మనుషుల పెళ్లిలానే వీటికి వివాహం జరిపించారు. 

ALSO READ | సీతారామచంద్ర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

పూర్తి సంప్రదాయ పద్దతిలో శాస్త్రోక్తంగా ఈ వివాహం జరిపించారు. కప్పలను వధూవరుల మాదిరిగానే అలంకరించి.. తాళి బొట్టు, పూల దండలు మార్చుకోవడం, సప్తపది, తలంబ్రాలు అన్నీ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు.గ్రామస్తులు ఆద్వర్యంలో వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని కప్పలకు పెళ్ళి చేసి పూజలు నిర్వహించారు. పెళ్ళి అనంతరం వాటిని ఊరంతా ఊరేగింపు నిర్వహించారు. పురోహితుడు ఆధ్వర్యం లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పలకు పెళ్లి చేసి ఊరంతా ఊరేగిస్తే వర్షాలు కురుస్తాయి అంటున్నారు గ్రామస్తులు.. కప్పల పెళ్లి సందర్భంగా  వాయిద్యాలు వాయిస్తూ, భజనలు పాడుతూ  సందడి చేశారు.

ALSO READ | జగన్నాథ రథయాత్రను సక్సెస్ చేయాలి : కలెక్టర్ పమేలాసత్పతి