పోతంగల్ మండలంలో ఉచిత వైద్య శిబిరం

కోటగిరి, వెలుగు : అభయహస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బర్ల మధు ఆధ్వర్యంలో పోతంగల్ మండలం హంగర్గఫారం గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కోటగిరి సంజీవనీ హాస్పిటల్ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంపులో డాక్టర్ ఇంతియాజ్ బేగం పేషెంట్లకు వైద్య  పరీక్షలు నిర్వహించారు. 

142 మంది పేషేంట్లు వైద్య పరీక్షలు చేయించుకోగా, వారికి అవసరమైన మందులను అభయహస్తం ఫౌండేషన్ తరఫున ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎజాస్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ సజ్జత్, సంజీవని హాస్పిటల్ నిర్వాహకులు ప్రభాకర్, కుప్పల సాయిలు, హన్మంతరావు పటేల్, సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.