పెగడపల్లిలో ఉచిత వైద్య శిబిరం

బోధన్​, వెలుగు: బోధన్ మండలం పెగడపల్లిలో స్టార్​హాస్పిటల్స్ హైదరాబాద్​, పెగడపల్లి విలేజ్​ డెవలప్​మెంట్​అసోసియేషన్​ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తులతో పాటుగా చుట్టు పక్కల గ్రామాలకు చెందిన రోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందించారు. 

కార్యక్రమంలో స్టార్​ హాస్పిటల్​వైద్యులు డాక్టర్​ శశికాంత్​ఆర్థోపెడిక్​ సర్జన్​, డాక్టర్​ రాజు జనరల్​ ఫిజిషీయన్,  డాక్టర్​ఉదయ పాల్గొన్నారు.  పెగడపల్లి విలేజ్​ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరావు, జనరల్ సెక్రటరీ పోతారెడ్డి, పెంటకలాన్​ సొసైటీ చైర్మెన్​రాజరెడ్డి, విలేజ్ కమిటీ ప్రెసిడెంట్ దొనకంటి లక్ష్మారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.