Air India:ఎయిర్ ఇండియా విమానాల్లో ఫ్రీ WiFi ..ఎలా పనిచేస్తుందంటే..

ఎయిర్ ఇండియా ప్యాసింజర్లకు  గుడ్ న్యూస్.. ఇకపై మీరు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించేటప్పుడు ఇంటర్నెట్ లేదని చింతించాల్సిన అవసరం లేదు. ఎయిర్ ఇండియా తన కస్టమర్లకు కోసం  ఉచిత వైఫై ని అందిస్తోంది. ఈ వైఫై సౌకర్యం..డెమోస్టిక్ సర్వీసుల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ సర్వీసుల్లో కూడా అందు బాటులోకి తెస్తోంది. ఇకపై మీరు విమానాల్లో ప్రయాణిస్తూనే మీ ట్యాప్ టాప్, మొబైన్ ఫోన్లకలో సోషల్ మీడియాలో పోస్టులు చేయొచ్చు.. వాట్సాప్ లాంటి యాప్ లనుంచి మేసేజ్ లు పంపించుకోవచ్చు. 

ఎయిర్ ఇండియా సర్వీసుల్లో  దాదాపు 10వేల ఫీట్లకంటే ఎక్కువ ఎత్తులో కూడా మీరు వైఫై పొందవచ్చు. iOS, Android మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్, టాబ్లెట్స్ అందుబాటులో ఉంటుంది.

ఈ ఉచిత వైఫై ప్రోగ్రామ్ ను  పైలట్ ప్రాజెక్టు కింద ఇండియాలో అన్ని ప్రాంతాలకు, న్యూయార్క్, లండన్, పారీస్, సింగపూర్ లకు వెళ్లే అంతర్జాతీయ రూట్లలో అందిస్తున్నారు. 

ఎయిర్ ఇండియా ఏ విమానాల్లో ఈ వైఫై సౌకర్యం ఉంది..?

ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ లైన్స్ బస్ A350,  బోయింగ్ 787--9  సెలెక్టెడ్  ఎయిర్ బస్  A321 నియో ఎయిర్ క్రాప్ట్ లలో ఈ ఉచిత వైఫై సౌకర్యం ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా నిర్వహించబడే అంతర్జాతీయ విమానాల్లో ఇప్పటికే ఈ సౌకర్యం అందించబడుతుంది. 

Air India Wi-Fiని ఎలా యాక్సెస్ చేయాలి

ఎయిర్ ఇండియా విమానాలలో ప్రయాణికులు Wi-Fiని ఇలా యాక్సెస్ చేయొచ్చు. 
 మీ డివైజ్ లో Wi-Fi పై క్లిక్ చేసి Wi-Fi సెట్టింగ్‌లకు వెళ్లాలి. 
ఎయిర్ ఇండియా వై-ఫై నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకోవాలి
 మీ బ్రౌజర్‌లోని ఎయిర్ ఇండియా పోర్టల్‌కి వెళ్లిన తర్వాత PNR , చివరి పేరును ఎంటర్ చేయాలి. వైఫై కనెక్ట్ అయిపోతుంది. 

విమానాల్లో ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది? 

విమానంలో ఇంటర్నెట్ వ్యవస్థ రెండు రకాల టెక్నాలజీ లపై ఆధారపడి ఉంటాయి. మొదటిది ఎయిర్-టు-గ్రౌండ్ సిస్టమ్. ఇక్కడ  విమానంలో ఉన్న యాంటెన్నా భూమిపై ఉన్న సమీప టవర్ నుండి సంకేతాలను అందుకుంటుంది. ఒక నిర్దిష్ట ఎత్తు వరకు, విమానం గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతం మీదుగా వెళితే తప్ప కనెక్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా అందించబడుతుంది. ప్రాథమికంగా  గ్రౌండ్ టవర్లు ప్రాజెక్ట్ సిగ్నల్స్ పైకి  అలాగే ఈ సందర్భంలో ఉపయోగించే ఆన్-బోర్డ్ యాంటెనాలు విమానం కింద అమర్చబడి ఉంటాయి.

ALSO READ | ఇకపై అంతరిక్షం నుంచి స్మార్ట్ ఫోన్లకు డైరెక్ట్​గా కాల్స్

రెండవది ఉపగ్రహ ఆధారిత Wi-Fi వ్యవస్థ.. ఇది ఇప్పుడు మరింత ప్రజాదరణ పొందింది. గ్రౌండ్ స్టేషన్ల నుంచి ఇంటర్నెట్ ఉపగ్రహాల ద్వారా విమానాలకు ప్రసారం చేయబడుతుంది. విమానం బాడీపైన అమర్చిన యాంటెన్నాను ఉపయోగించి ఈ రకమైన కనెక్టివిటీ విస్తృత కవరేజీని అందిస్తుంది, గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతాలపై విమానం ఎగురుతున్నప్పుడు కనెక్టివిటీని అందించడంలో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

విమానం యాంటెన్నాకు అనుసంధానించబడిన ఆన్-బోర్డ్ రూటర్ ద్వారా ప్రయాణీకుల వ్యక్తిగత పరికరానికి డేటా ప్రసారం చేయబడుతుంది. విమానం 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు, ఆన్-బోర్డ్ యాంటెన్నా ఉపగ్రహ ఆధారిత సేవలకు మారుతుంది.సాధారణంగా విమానంలో Wi-Fi భూమిపై కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది.