ఉగండాలో పిడుగు పడి 14 మంది మృతి

కంపాలా: ఉగండాలో పిడుగు పడి 14 మంది మృతి చెందారు. ఉత్తర ఉగండాలోని లాంవో జిల్లాలో శరణార్థి శిబిరంపై శనివారం పిడుగు పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, మరో 34 మంది గాయపడ్డారని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దక్షిణ సూడాన్‌‌ నుంచి వీరంతా శరణార్థులుగా ఇక్కడికి వచ్చారన్నారు. వారంతా ప్రేయర్‌‌‌‌ చేసేందుకు సిద్ధం అవుతుండగా పిడుగు పడిందని తెలిపారు.