లంచం తీసుకున్న ఉద్యోగికి నాలుగేళ్ల జైలు

 

  • 2013లో రూ. 3 వేలు తీసుకుంటూ పట్టుబడిన వ్యవసాయ శాఖ ఉద్యోగి

కరీంనగర్‌‌‌‌క్రైం, వెలుగు : లంచం తీసుకుంటూ పట్టుబడిన వ్యవసాయ శాఖఉద్యోగికి నాలుగేళ్ల జైలు, రూ. 6 వేల ఫైన్‌‌‌‌ విధిస్తూ కరీంనగర్‌‌‌‌ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వివేక్‌‌‌‌ కుమార్‌‌‌‌ గురువారం తీర్పు చెప్పారు. రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన దైవాల శ్రీనివాస్ ఎరువుల దుకాణం పర్మిషన్‌‌‌‌ కోసం కరీంనగర్‌‌‌‌లోని అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో 2013 ఆగస్టు 27న అప్లై చేసుకున్నాడు. 

పర్మిషన్‌‌‌‌ ఇప్పించేందుకు రూ. 3 వేలు లంచం ఇవ్వాలని ఏడీ ఆఫీస్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ అసిస్టెంట్‌‌‌‌గా పనిచేస్తున్న అన్నారెడ్డి ప్రాణవేందర్‌‌‌‌రెడ్డి డిమాండ్‌‌‌‌ చేశాడు. దీంతో శ్రీనివాస్‌ కరీంనగర్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో 2013 సెప్టెంబర్‌‌‌‌ 5న శ్రీనివాస్‌‌‌‌ కరీంనగర్‌‌‌‌లోని ఏడీ ఆఫీస్‌‌‌‌కు వెళ్లి ప్రాణవేందర్‌‌‌‌రెడ్డికి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌‌‌‌ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి వివేక్‌‌‌‌ కుమార్‌‌‌‌ ప్రాణవేందర్‌‌‌‌రెడ్డికి నాలుగేళ్ల జైలు, రూ. 6 వేల ఫైన్‌‌‌‌విధించారు.