- జనగామ జిల్లా కేంద్రంలో ఘటనలు
జనగామ, వెలుగు: మాంజా దారం తగిలి నలుగురికి తీవ్రగాయాలైన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన శేషత్వం సనత్కుమార్తన ఫ్రెండ్స్ సాయికుమార్, సాయిరాంతో కలిసి ఆదివారం బైక్ పై జనగామజిల్లా కేంద్రంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుంచి వెళ్తున్నారు. సమీపంలో ఓ వ్యక్తి మాంజా దారంతో పతంగి ఎగుర వేస్తుండగా అది ప్రమాదవశాత్తు వీరి గొంతులకు చుట్టుకుంది. దీంతో వారికి తీవ్ర గాయాలై రక్తస్ర్తావం అయింది. వెంటనే స్థానికులు జిల్లా హాస్పిటల్‌కు తరలించడంతో ట్రీట్‌మెంట్‌చేసి పంపించారు.
దంపతులు తమ కొడుకుతో బైక్ పై అదే బ్రిడ్జిపై నుంచి వెళ్తుండగా మాంజా దారం తగిలి బాలుడి గొంతుకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని కూడా జిల్లా హాస్పిటల్లో చేర్పించగా ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎంసీహెచ్‌కు తరలించారు. పతంగులకు మాంజా దారం వాడడం నిషేధమైనప్పటికి అక్రమంగా వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్‌రోడ్‌లోని షాపుల్లో మాంజా దారం ఇష్టానుసారంగా విక్రయిస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.