వాగులో నీళ్లు తాగడానికి వెళ్లి నాలుగు ఆవులు మృతి

కరీంనగర్ లో విషాదం చోటుచేసుకుంది. రూరల్ మండలం బొమ్మకల్ మానేరు వాగులో నీళ్లు తాగేందుకు వెళ్లిన నాలుగు ఆవులు కరెంట్ షాక్ తో మృత్యువాత పడ్డాయి. మానేరు వాగులో ఓ రైతు పంట పొలానికి నీళ్లు పెట్టుకునేందుకు కరెంటు మోటార్ బిగించాడు. అదే సమయంలో  కోరు కంటి సత్యనారాయణ అనే రైతుకు చెందిన నాలుగు ఆవులు నీళ్లు తాగడానికి వాగులోకి వెళ్లాయి.

 నీళ్లల్లో ఉన్న  కరెంటు  వైర్ల వల్ల విద్యుత్  షాక్ తగిలి నాలుగు ఆవులు అక్కడిక్కడే మృతి చెందాయి.  ఆవులు అక్కడిక్కడే చనిపోవడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నాడు. అలాగే అక్రమంగా మానేరు వాగులో కరెంటు మోటార్ బిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సత్యనారాయణ.