ఆర్మూర్, నందిపేటలో నాలుగు బస్సులు సీజ్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్, నందిపేటలో గురువారం మోటర్​ వెహికల్ ఆఫీసర్స్​ఆధ్వర్యంలో ప్రైవేటు స్కూల్​బస్సులను తనిఖీ చేశారు. ఆర్మూర్​లో సరైన డాక్యుమెంట్స్, నందిపేట్ లో ఫిట్నెస్​లేకుండా నడుపుతున్న  మూడు బస్సులను, ఆర్మూర్​లో ఒక బస్సును సీజ్​ చేసినట్లు ఆర్మూర్​ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. తనిఖీల్లో ట్రైనీ ఏఎంవీఐలు నల్ల శ్రీనివాస్, బండారి పవన్​ కల్యాణ్, కుమ్మరి సాగర్, ఘణపురం రోహిత్​రెడ్డి  పాల్గొన్నారు.