నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నర్సంపేట, వెలుగు : నర్సంపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లె, పర్శనాయక్​తండా, నారాయణ తండా వరకు రూ.2.50 కోట్ల నిర్మించే తారు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

మాధన్నపేటలో ఇందిరా మహిళా శక్తి స్కీం కింద మంజూరైన సంచార చేపల వాహానాన్ని ప్రారంభించారు. పర్శనాయక్​తండాలో ఆర్వో వాటర్​ప్లాంట్​ను ప్రారంభించారు. మార్కెట్​ కమిటీ చైర్మన్​ పాలాయి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.