మాజీ జడ్పీటీసీ సైదులుగౌడ్ కు రిమాండ్

నల్గొండ అర్బన్, వెలుగు :  వరుసగా కోర్టు వాయిదాలకు గైర్హాజరైన తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులుగౌడ్ కు ఈనెల 7న స్పెషల్ మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు డీఎస్సీ శివరాంరెడ్డి తెలిపారు. తిప్పర్తి మండలానికి చెందిన తండు సైదులుగౌడ్ 2020లో  రేగట్టె నవీన్ రెడ్డితో భూతగాదాల విషయంలో తండు సైదులు తన వద్ద ఉన్న

 పిస్టల్ తో బెదిరించడంతో నాటి సీఆర్ నంబర్ 98/20 యూ/ఎస్ 387 ఐపీసీ సెక్షన్స్ కింద తిప్పర్తి పోలీస్ స్టేషన్​లో అతడిపై కేసు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు సైదులు వరుసగా హాజరుకాకపోవడంతో శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.