పెండింగ్ బిల్లుల కోసం  మాజీ సర్పంచుల నిరసన

సిరిసిల్ల  టౌన్, వెలుగు: పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్​ చేస్తూ మాజీ సర్పంచులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ తమ భార్యాపిల్లల బంగారు నగలు అమ్మి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని ప్రభుత్వం నేటికీ పెండింగ్ బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే నిరాహార దీక్షలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు.