నందిపేట, వెలుగు : నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో సోమవారం పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నందిపేట మండలంలో 77.08 శాతం, డొంకేశ్వర్ మండలంలో 74.12 శాతం పోలింగ్ నమోదయింది. నందిపేట, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి వినయ్‌రెడ్డి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. వెల్మల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త ల పై నరేశ్ అనే ఎస్ఐ చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు.