కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకన్న టెంపుల్‌‌‌‌‌‌‌‌ను పూర్తిచేయాలి : గంగుల కమలాకర్‌

  • టీటీడీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ను కలిసిన ఎమ్మెల్యేగంగుల

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టౌన్, వెలుగు : కరీంనగర్ సిటీలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిచేయాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీటీడీ చైర్మన్​బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయుడిని కోరారు. గురువారం తిరుపతిలో టీటీడీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెంపుల్​నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించి భూమిపూజ కూడా చేశామన్నారు. 

ఆలయ నిర్మాణానికి టీటీడీ నుంచి రూ.20కోట్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు. ఆలయాన్ని పూర్తిచేయడంపై టీటీడీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ సానుకూలంగా స్పందించినట్లు గంగుల తెలిపారు. ఆయన వెంట హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌, కోరుట్ల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ తదితరులు ఉన్నారు.