కాంగ్రెస్ అన్నిరంగాల్లో విఫలమైంది : జగదీశ్ రెడ్డి 

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి 

నేరేడుచర్ల(పాలకవీడు), వెలుగు : కాంగ్రెస్ అన్నిరంగాల్లో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. పాలకవీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి తల్లి ఇటీవల మరణించగా, వారి కుటుంబ సభ్యులను మంగళవారం ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ లో కనీసం వ్యవసాయం తెలిసిన మంత్రులుంటే వాళ్లకు రైతుల బాధేమిటో తెలిసేదని ఆరోపించారు. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు మహా అద్భుతం అని, ఆ ప్రాజెక్టు ద్వారానే పంటలు పడుతున్నాయని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.