సిద్దిపేటకు భారత క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌

భారత మాజీ క్రికెటర్ సునీల్‌ గవాస్కర్‌ గురువారం(నవంబర్ 14) సిద్దిపేటలో పర్యటించనున్నారు. కొండపాకలోని ఓ ఆసుపత్రిలో కార్డియక్‌ వార్డును ఆయన ప్రారంభించనున్నారు. మరికొద్దిసేపట్లో భారత క్రికెటర్ సిద్దిపేట చేరుకోనున్నట్లు తెలుస్తోంది. 

గవాస్కర్‌ క్రికెట్ జీవితం

'లిటిల్ మాస్టర్'గా పేరొందిన సునీల్ గవాస్కర్‌ 1971లో భారత జట్టు తరపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. 125 టెస్టుల్లో 10122 పరుగులు, 108 వన్డేల్లో 3092 పరుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ పేరిట భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు 'బోర్డర్- గవాస్కర్' ట్రోఫీని నిర్వహిస్తున్నాయి.