బీజేపీ, ఆర్ఎస్ఎస్​లతో దేశానికి ప్రమాదం

  •     డెవలప్​ మెంట్​ను పక్కన పెట్టి, హింసకు తావు
  •     కాషాయాన్ని ఆపడం పౌరుల బాధ్యత
  •     మాజీ ఐఏఎస్​ ఆఫీసర్​ ఆకునూరి మురళి

నిజామాబాద్, డిచ్​పల్లి, వెలుగు : లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించాల్సిన బాధ్యత పౌరసమాజంపై ఉందని మాజీ ఐఏఎస్​అధికారి ఆకునూరి మురళి అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని పక్కదారి పట్టించి, దేశంలో హింసను ప్రేరేపించడమే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎలక్షన్​లో బీజేపీని ఆపేందుకు యూనివర్సిటీ స్టూడెంట్స్​తో కలిసి ముందుకు వెళ్లాలని తెలంగాణ జాగో డిసైడ్​అయిందన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని విజిట్​ చేశారు. అనంతరం నిజామాబాద్​లో మీడియాతో మాట్లాడారు.

పేద ప్రజలు ఇప్పటికే చాలా నష్టపోయారని, విద్యార్థులకు స్కాలర్​షిప్స్,​ ఫెలోషిప్స్ ​అందడం లేదన్నారు. విద్యార్థిలోకానికి బీజేపీ గవర్నమెంట్​తో జరుగుతున్న నష్టాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని 13 వర్సిటీల్లో సభలు నిర్వహిస్తామన్నారు. మొదటి సభను హైదరాబాద్​వర్సిటీలో, చివరి సభను మార్చి 12న తెలంగాణ వర్సిటీలో నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

జాగో తెలంగాణ కోర్​కమిటీ మెంబర్​ప్రొఫెసర్​నిర్మల, స్టేట్​ డెమొక్రటిక్​ ఫోరం కన్వీనర్​ వినాయక్​రెడ్డి, పీడీఎస్​యూ స్టేట్​ప్రెసిడెంట్​ మహేశ్, జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఏఐఎస్ఎఫ్​స్టూడెంట్​ యూనియన్​ లీడర్లు అంజలి, కర్క గణేశ్, రాజేశ్వర్, రఘురాం, ఆషూర్, నిఖిల్​ పాల్గొన్నారు.