మెడపై కత్తి పోట్లు.. క్రికెటర్ తల్లి అనుమానాస్పద మృతి

నటుడు, మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా తల్లి మాల అశోక్ అంకోలా (77) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. పూణేలో నివాసముంటున్న ఫ్లాట్‌లో ఆమె శవమై కనిపించారు. మెడపై కత్తి పోట్లు ఉండటం పలు అనుమానాలకు దారితీస్తోంది.

పూణేలోని డెక్కన్ ప్రాంతంలో కుమార్తెకు చెందిన ఫ్లాట్‌లో మాల అంకోలా నివాసముంటున్నారు.. కుమార్తె కూడా తన తల్లికి సమీపంలోనే ఉంటోంది. తరచూ తల్లి వద్దకు వస్తూ ఉంటుంది. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో పనిమనిషి అంకోలా తల్లి ఉంటున్న ఇంటికి వెళ్లగా గది తలుపులు తీయలేదు. ఆమె స్పందించకపోవడంతో కూతురు వద్దనున్న తాళాలతో ఇంటి తలుపులు తెరవగా.. మంచంపై అపస్మారక స్థితిలో స్థితిలో పడి ఉంది. 

హుటాహుటీన కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మాల మెడపై కత్తి పోట్లు ఉన్నట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న డెక్కన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Salil Ankola (@salilankola)

మృతురాలు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరా పనిచేయకపోవడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సచిన్‌తో కలిసి అరంగేట్రం

సలీల్ అంకోలా మహారాష్ట్రతో తన క్రికెట్ కెరీర్‌ ప్రారంభించాడు. నవంబర్ 15, 1989న ఇండియా తరుపున సచిన్ టెండూల్కర్ అరంగేట్రం చేసిన చారిత్రాత్మక టెస్టు మ్యాచ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అంకోలా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ తీశాడు. 1996 వన్డే ప్రపంచ కప్‌ భారత జట్టులో అంకోలా సభ్యుడు.