బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్

బీఆర్ఎస్ నేత, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. నల్లగొండ పరిధిలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‎కు వెళ్తుండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాగా, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా బెటాలియన్ కానిస్టేబుల్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం (అక్టోబర్ 25) బాధితులకు మద్దతు తెలిపేందుకు వెళ్లడానికి కంచర్ల భూపాల్ రెడ్డి బయలుదేరారు. 

ALSO READ | కేటీఆర్ అదుపులో పెట్టుకో.. లేదంటే మేం కంట్రోల్ చేయాల్సి వస్తది: జగ్గారెడ్డి వార్నింగ్

అప్రమత్తమైన పోలీసులు.. బెటాలియన్ వద్దకు వెళ్లకుండా కంచర్ల భూపాల్ రెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో కంచర్ల  వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కంచర్ల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు మునుగోడు పీఎస్‎కు తరలించారు. కాగా, ఏక్ స్టేట్.. ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనలకు దిగిన విషయం తెలిసిందే.