కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే అనుచరులు

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్​ మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రధాన అనుచరులు,  ఇతర లీడర్లు  మంగళవారం బీఆర్​ఎస్ ను వీడి కాంగ్రెస్​ లో చేరారు. ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య,  మున్సిపల్ మాజీ  వైస్ చైర్మన్ మోత్కురి లింగా గౌడ్, బీఆర్ఎస్ మండల  ప్రెసిడెంట్ ములకిడి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.  

ఆర్మూర్​ కాంగ్రెస్  నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్​ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్ గౌడ్, నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్​మానాల మోహన్ రెడ్డి సమక్షంలో వారు  పార్టీ లో చేరారు. ​