ఫారెస్ట్​ భూమి చదును..అడ్డుకున్న ఆఫీసర్లపై దాడి

  • కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఘటన

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఫారెస్ట్​ ల్యాండ్​ను కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నగిరిపల్లి బీట్​ పరిధిలో అర్ధరాత్రి ఫారెస్ట్​ భూమిని ట్రాక్టర్లతో కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారు. మాచారెడ్డి డిప్యూటీ రేంజ్​​ఆఫీసర్​ రమేశ్,  బీట్​ ఆఫీసర్​ నాగరాజు

బేస్​ క్యాంప్​ ఆఫీసర్​ మోహన్, సిబ్బందితో అక్కడకు వెళ్లారు. ఫారెస్ట్​ ఆఫీసర్లను చూసి భూమిని చదును చేస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోతుండగా, వారిని వీడియో తీశారు. దీంతో ఆగ్రహించిన నిందితులు జీపులో ఉన్న ఆఫీసర్లను కిందికి లాగి దాడి చేశారు. ఫారెస్ట్​ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు  బోదాసు సురేశ్, కుంచ లింగంపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.