మహిళా సాధికారత కోసం.. ఇందిరా ఫెలోషిప్ ఫర్ ఉమెన్

శక్తి అభియాన్​లో భాగంగా ఉమెన్ ఎంప వరింగ్,  ట్రాన్స్​ఫార్మింగ్ పాలిటిక్స్ అనే  లక్ష్యంతో ఇందిరా ఫెలోషిప్ అనే ఒక సంస్థని రాహుల్ గాంధీ ఆలోచన మేరకు  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ లక్ష్యం.. గ్రామీణ,  పట్టణ,  నగరాల్లో ఉన్న అన్ని వర్గాల  మహిళలను ఎంపిక చేసుకుని వారికి  ఇందిరా ఫెలోషిప్ పేరు మీద ఆర్థిక సహకారం అందించడం,  రాజకీయాల్లో వారి  భాగస్వామ్యాన్ని  ప్రోత్సహించడం ముఖ్య ఉద్దేశంగా  సంస్థ పనిచేస్తోంది.  

ఇందిరా ఫెలోషిప్  అనే సంస్థ  మూడు రోజులపాటు ఇందిరా ఫెలోషిప్ తెలంగాణ యూనిట్ ఇంచార్జ్  డా. సల్ల సౌజన్య గారి ఆధ్వర్యంలో కీసరలోని బాలవికాస్ కేంద్రంలో ఫెలోషిప్ మెంబర్స్​కి బూట్ క్యాంప్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ బూట్ క్యాంప్ సమావేశాల్లో వివిధ రంగాల్లో  నైపుణ్యం ఉన్న నిపుణులతో అవగాహన తరగతులు నిర్వహించి వారి అనుభవాలు చర్చించడం  జరిగింది. 

ఈ వర్క్ షాప్ లో  మేధావులు,  వ్యాపారవేత్తలు,  డాక్టర్స్,  సాంకేతిక నిపుణులు,  సామాజిక,  రాజకీయ నేతలతో,  నేటి సమాజంలో  ప్రత్యేకంగా భారత రాజకీయాల్లో  మహిళల పాత్ర,  వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్లు,  భవిష్యత్తు రాజకీయ అవకాశాలపై అవగాహన కల్పించారు.  బూట్ క్యాంప్​కు  హాజరైనవారిలో ఆదిలాబాద్ లాంటి  మారుమూల ప్రాంతాల నుంచి సామాన్య మహిళలతోపాటు  వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి  మహిళలు   పాల్గొని  పలు అంశాలపై  అభిప్రాయాలు తెలియజేశారు.  

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న  చైతన్యవంతమైన మహిళలను ఇందిరా ఫెలోషిప్ లో భాగం చేసి రాజకీయాల్లో అవకాశాలు కల్పించడమే బూట్ క్యాంప్  ప్రధాన ఉద్దేశం. ఆదిలాబాద్ కంటెస్టెంట్డ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ ఇందిరా ఫెలోషిప్ మెంబర్ కావడం గమనార్హం.  ఈ  కార్యక్రమానికి మంత్రి సీతక్క,  పలువురు ఏఐసీసీ నాయకులు హాజరయ్యారు. భారత రాజకీయాల్లో మహిళల పాత్ర, సవాళ్లు, భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై నేను మాట్లాడడం జరిగింది. 

- వలిగొండ నరసింహ,  పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్,
ఉస్మానియా యూనివర్సిటీ