Good Health: పండంటి బిడ్డ పుట్టాలంటే ఇవి తప్పకుండా తీసుకోవాలి..!

బిడ్డకు జన్మనివ్వటం స్త్రీజాతికి ఉన్న గొప్ప వరం. గర్భధారణ సమయంలో తీసుకునే ఆహరం శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని  డాక్టర్లు చెపుతున్న మాట. ప్రెగ్నెన్సీ సమయంలో హెల్తీ డైట్ గనక తీసుకోకపోతే పుట్టబోయే బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పండంటి బిడ్డ పుట్టాలంటే తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం:

ఆకు కూరలు:

పాలకూర, బచ్చలకూర, కాలే వంటి ఆకు కూరల్లో ఐరన్, కాల్షియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా ఫోలేట్ ప్రెగ్నెన్సీ సమయంలో బిడ్డ యొక్క నాడీ వ్యవస్థ ఎదుగుదల కోసం తోడ్పడుతుంది. అంతే కాకుండా బిడ్డకు పుట్టుకతో వచ్చే లోపాల నుండి కాపాడుతుంది. వీటిలో ఉండే ఐరన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడటం వల్ల ఎనిమా వంటి సమస్యలు రావు. కాల్షియం తల్లి, బిడ్డ ఇద్దరిలో ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. 

లీన్ ప్రోటీన్స్:

ఫిష్, పౌల్ట్రీ, టోఫు వంటి లీన్ ప్రోటీన్ ఆహారాలు ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని క్రమం తప్పకుండ తీసుకోవటం వల్ల బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా అందేలా చేస్తాయి. ప్రోటీన్లు క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల బేబీ యొక్క మజిల్ డెవలప్మెంట్ మెరుగుపడుతుంది. అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల్లో వచ్చే అలసట, కండరాల వాపు వంటి సమస్యలు నుండి ప్రోటీన్స్ తీసుకోవటం వల్ల దూరంగా ఉండచ్చు.

చిరు ధాన్యాలు:

బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి చిరు ధాన్యాలలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్ B వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోవటం, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పోషకాలు బిడ్డ యొక్క బ్రెయిన్, మరియు నర్వస్ సిస్టం డెవలప్మెంట్ కోసం తోడ్పడతాయి. 

డైరీ ఉత్పత్తులు:

పాలు, పెరుగు, వెన్న వంటి డైరీ ప్రాడక్ట్స్ లో కాల్షియమ్, విటమిన్ D, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి బిడ్డ యొక్క బోన్, టీత్, డెవలప్మెంట్ కోసం తోడ్పడతాయి. కాల్షియం బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేసి ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

కలర్ ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్: 

బ్రైట్ కలర్స్ లో ఉండే ఆరెంజ్, బెర్రీస్, బెల్ పెప్పర్స్, క్యారెట్స్ వంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంపొందించి తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించటంలో కీలక పాత్ర పోషిస్తాయి.